పవన్ కల్యాణ్ కు అతని వల్ల ప్రాణహాని : కేఏ పాల్
గత కొద్ది సంవత్సరాలుగా బీసీలు, కాపుల్లో ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. అందుకే చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినా.. ఆయన..
k a paul sensational comments on pawan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి ప్రచార యాత్ర నేటి నుంచి అన్నవరం సత్యనారాయణ దేవుని ఆశీస్సులతో మొదలైంది. పవన్ వారాహి యాత్రపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తాను సీఎం అభ్యర్థిగా ప్రచార యాత్ర చేస్తున్నట్లు ప్రకటించకపోతే అతనికి ప్రాణహాని ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించి చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టేందుకు యాత్ర చేయడం సరికాదన్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా బీసీలు, కాపుల్లో ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. అందుకే చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినా.. ఆయన కాంగ్రెస్ తో విలీనం అవడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడు పవన్ కూడా తాను సీఎం అభ్యర్థిని కాను అని చెప్పడం సరికాదన్నారు. ఏపీకి బీజేపీ, చంద్రబాబు కలిసి 2014 నుండి 2019 వరకూ అన్యాయం చేశాయన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను చంపించినట్లే.. పవన్ కల్యాణ్ కు కూడా ప్రాణహాని ఉందని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయం, అధికారం కోసం ఏమైనా చేయడానికి తెగిస్తారన్నారు. చంద్రబాబే చంపించి, దానిని జగన్ పైకి నెట్టేసినా ఆశ్చర్యం లేదన్నారు. కొడుకు లోకేష్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా వెళ్తారంటూ వీడియో విడుదల చేశారు.