శీతాకాల సమావేశాల్లోనూ సెగలు

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 23వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి

Update: 2021-11-29 02:03 GMT

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 23వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ప్రధానంగా పెట్రో ఉత్పత్తుల ధరలపై చర్చ జరపాలని కాంగ్రెస్ పట్టు బట్టనుంది. మరోవైపు మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లులను లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనిపై ప్రధానంగా చర్చించాలని బీజేపీ భావిస్తుంది.

ఇరుకున పెట్టేందుకు....
అయితే విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాలన్నీ భేటీ అయి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తారు. మరోవైపు ఈరోజు పార్లమెంటు వరకూ రైతులు తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకున్నారు. రైతు చట్టాల ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుండటంతో ర్యాలీని విరమించుకన్నట్లు వారు ప్రకటించారు.


Tags:    

Similar News