దేశ వ్యాప్తంగా నేడు వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్నారు. సంప్రదాయాల మేరకు గణేశుడి ప్రతిమను ప్రతి ఇంట్లో ఉంచి పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా గణపతి పూజతో ప్రారంభం చేయడం ఆనవాయితీ. విశ్వగణపతి అయిన ఆయనే ప్రధమ గణపతిగామారారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గణపతి నాధులు కొలువు దీరారు.
నేటి నుంచి ...
నేటి నుంచి గణేశ్ నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగాలంటే గణపతి పూజ చేయాలని పండితులు చెబుతారు. అందుకే నేడు దేశ వ్యాప్తంగా గణనాధుడి చవితి వేడుకలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ జంట నగరాల్లోనూ, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ భారీ మహాగణపతులను ఉంచారు. మంటపాల్లో నేటి నుంచి సంప్రదాయ బద్ధంగా పూజలు ప్రారంభం కానున్నాయి.