కరూర్ ఘటనపై నేడు విజయ్ పార్టీ కీలక ప్రకటన

కరూర్ ఘటనపై నేడు విజయ్ పార్టీ కీలక ప్రకటన చేయనుంది.

Update: 2025-10-07 05:59 GMT

కరూర్ ఘటనపై నేడు విజయ్ పార్టీ కీలక ప్రకటన చేయనుంది. తమిళనాడులో కరూర్ లో జరిగిన టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన నేపథ్యంలో విజయ్ పర్యటనలను కొద్దికాలం పాటు వాయిదా వేశారు. రెండు వారాల పాటు వాయిదా వేసుకుంటున్నట్లు విజయ్ ఇప్పటికే ప్రకటించారు. మృతులు కుటుంబాల పరామర్శపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశముంది.

పోలీసుల అనుమతితో...
పోలీసుల అనుమతితో విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన కుటుంబాలను విజయ్ స్వయంగా పరిశీలించి పార్టీ తరుపున పరిహారం ప్రకటించే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున ఏం చేయాలన్న దానిపై కూడా ఇప్పటికే నేతలతో చర్చించిన విజయ్ పార్టీ టీవీకే నేడు తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది.


Tags:    

Similar News