ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ హోదాలో పార్లమెంటు సమావేశాలకు తొలిరోజు హాజరైన ఆయన తన రాజీనామా లేఖను రాత్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా కారణంగా ప్రసతుతుం డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు.
అనారోగ్య కారణాల వల్లనే...
అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే తాను రాజీనామా చేశానని, వేరే ఇతర కారణాలు లేవని, తనకు ఈ పదవి ఇచ్చి ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2022 ఆగస్టు 11వ తేదీన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించిన జగదీప్ థన్ ఖడ్ 2027 ఆగస్టు వరకూ పదవీ కాలం ఉంది. అయినా సరే ఆరోగ్య కారణాల వల్లనే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. కొత్త ఉపరాష్రపతి ఎంపిక ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.