Breaking : సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు
కోల్ కత్తా మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం కేసులో తీర్పు వెలువడింది.
కోల్ కత్తా మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం కేసులో తీర్పు వెలువడింది. నిందితుడికి జీవితఖైదు ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాలంటీర్ గా పనచేస్తున్న సంజయ్ రాయ్ ను 2024 ఆగస్గు 9వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీల్దా కోర్టు సంజయ్ రాయ్ ను దోషిగా నిర్ధారించింది. శిక్షపై కోర్టులో ఇరువర్గాల వాదనలను ముగిసాయి.
తీర్పు రిజర్వ్ చేసి...
అయితే సమాజంలో నమ్కం నింపాలంటే ఇతనికి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ తరుపు న్యాయవాది వాదించారు. వాదనలను పూర్తయిన అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోల్ కత్తా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ కు ఎలాంటి శిక్ష విధిస్తారన్నది దేశమంతా ఆసక్తిగా చూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కోల్ కోత్తా కోర్టు ఈరోజు శిక్ష విధించడంతో పై కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.