మహాకుంభమేళాలో ముప్ఫయికి పెరిగిన మృతుల సంఖ్య
ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో మొత్తం ముప్ఫయి మంది మరణించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం ముప్ఫయి మంది మరణించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన తొక్కిసలాటలో ముప్ఫయికి మృతుల సంఖ్య చేరిందని డీజీపీ తెలిపారు. బారికేడ్లు విధ్వంసం కారణంగానే తొక్కిసలాట జరిగిందని తెలిపారు. అరవై మందికి ఆసుపత్రిలో చికిత్సలు జరుగుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఐదుగురిని గుర్తించలేదు...
మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు వీఐపీ ప్రొటోకాల్ ను కూడా రద్దు చేశామని డీజీపీ తెలిపారు. ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగిందని ఆయన తెలిపారు. మృతి చెందిన ముప్ఫయి మందిలో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురిని గుర్తించలేదని ఆయన తెలిపారు. భక్తులు సహకరించి అన్ని ఘాట్ లలో స్నానమాచరించాలని డీజీపీ కోరారు.