నేడు కేంద్రమంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు?
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు జమిలి ఎన్నికలపై కూడా చర్చించే అవకాశముంది.
వీరికి గుడ్ న్యూస్...
అయితే ఈరోజు కేబినెట్ సమావేశంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలను చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని హస్తిన వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా రైతులు, బీహార్ కు సంబంధించిన కొన్ని అంశాలపై కూడా చర్చించి ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని వర్గాలకు ఈ సమావేశం ద్వారా గుడ్ న్యూస్ అందనుంది.