ఎన్నాళ్ల నుంచో?

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును కల్పించే బిల్లు కేంద్ర మంత్రి వర్గం వర్గం ఓకే చెప్పింది

Update: 2023-09-19 02:30 GMT

మహిళ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును కల్పించే హక్కుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ నేతృత్వంలో రెండు గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఆయన ట్వీట్ ద్వారా తెలపడంతో ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెబుతూ చేసిన ట్వీట్ తో మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని తెలిసింది.

ఈసారైనా...
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని ఈరోజు కసరత్తు కాదు. ఎప్పటి నుంచో దనిపై కసరత్తు జరుగుతూనే ఉంది. 1996లోనే దీనికి శ్రీకారం చుట్టారు. అప్పటి దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అనంతర ప్రభుత్వాలు బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు మాత్రం ఆమోదం పొందలేదు. పెండింగ్‌లోనే ఉంది. చివరకు మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఈసారైనా బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ హయాంలోనే మహిళ రిజ్వేషన్ బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. ఈసారైనా ఆమోదం పొందాలని ఆశిద్దాం.


Tags:    

Similar News