ఆధార్ అప్ డేట్ గడువు మరోసారి పొడిగింపు.. ఈ సారి ఏడాది
ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును యూఐడీఏఐ మరోసారి పొడిగించింది
ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును యూఐడీఏఐ మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్ లోడ్ చేసుకునేందుకు నేటితో గడువు ముగిసింది. అయితే గడువు ముగియనుండటంతో మరోసారి ఆధార్ అప్ డేట్ ను చేసుకునుందుకు తాజాగా ఈ నిర్ణయాన్ని యూఐడీఏఐ వెల్లడించింది.
మరో ఏడాది పాటు...
2026 జూన్ 14 వరకు అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు ఉచితంగా ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకునే వీలు కలిగింది. ఈ మేరకు యూఐడీఏఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని ఉడాయ్ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు.