జమ్మూలో మళ్లీ ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

కశ్మీర్ లోని కుల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు..

Update: 2022-01-04 09:15 GMT

భారత ఆర్మీ ఉగ్రస్థావరాలను గుర్తించి మెరుపుదాడులకు దిగుతోంది.అక్కడి పోలీసులతో కలిసి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. కొద్దిరోజులుగా ఉగ్రవాదులున్న స్థావరాలపై దాడులు చేస్తున్నారు. తాజాగా మంగళవారం మరోమారు భద్రతా బలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కశ్మీర్ లోని కుల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు.. బలగాలతో కలిసి కుల్గామ్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

Also Read : సముద్రంలోనే ఫైట్... విశాఖలో ఉద్రిక్తత

భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరుపగా.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారి వెల్లడించారు. తమ రాకను గమనించిన మరికొందరు ఉగ్రవాదులు పారిపోయారని ఆయన తెలిపారు. కాగా.. మృతిచెందిన ఉగ్రవాదులు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా గుర్తించారు. మృతుల వద్ద నుంచి పేలుడు పదార్థాలు, ఓ అత్యాధునిక వెపన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


Tags:    

Similar News