Congress : నేడు కాంగ్రెస్ సమావేశాల ముగింపు
కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల కీలక సమావేశాలు నేడు ముగియనున్నాయి
కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల కీలక సమావేశాలు నేడు ముగియనున్నాయి. అహ్మదబాద్ లో జరుగుతున్న సమావేశాలు నేటితో ముగియనుండటంతో ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అరవై నాలుగేళ్ల తర్వత అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వరసగా మూడు ఎన్నికల్లో ఓటమితో పాటు వివిధ రాష్ట్రాల పరిస్థితులపై సమీక్షించుకుని రోడ్డు మ్యాప్ ను రూపొందించుకున్నారు.
నేడు ఏఐసీసీ తీర్మానాలను...
మరోవైపు నేడు ఏఐసీసీ సమావేశంలో సీడబ్ల్యూసీ తీర్మానాలపై చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉందని తెలిసింది. ఈ సమావేశానికి దాదాపు పన్నెండు వందల మంది ఏఐసీసీ సభ్యులు హాజరు కానున్నారు. భవిష్యత్ నిర్ణయాలతో పాటు పార్టీని వివిధ రాష్ట్రాల్లో బలోపేతం చేయడంపై కూడా ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేతలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.