‌Haryana : నాటకం వేస్తుండగా కుప్పకూలి గుండెపోటుతో మృతి

హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. రాంలీలా నాటకంలో హనుమంతుడు వేషం వేసిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు

Update: 2024-01-24 02:15 GMT

Ramleela: హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా హర్యానాలోని భివానీలో అందరూ సంతోషంగా పండగ చేసుకున్నారు. కేరింతలు కొట్టారు. భజనలు చేశారు. రాములోరు అయోధ్య ఆలయంలోకి అడుగుపెట్టారని అందరూ సంతోషించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

భజనలతో పాటు...
అయితే ఈ సందర్భంగా ఆలయాల్లో భజనలతో పాటు నాటక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. హర్యానాలోని భివానీలో రాంలీల నాటకాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందరూ నాటకాన్ని తిలకిస్తుండగా అనుకోని ఘటన జరిగింది. అందులో హనుమంతుడు వేషం వేసుకున్న వ్యక్తి కుప్ప కూలి పడిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గుండెపోటుతోనే మరణించినట్లు తర్వాత వైద్యులు ధృవీకరించారు.
హనుమంతుడు వేషధారణలో....
రాంలీల నాటక ప్రదర్శనలో అందరూ నటులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకం రక్తి కట్టింది. ప్రేక్షకులందరూ భక్తిభావంతో నాటకాన్ని చూస్తున్నార. అయితే హనుమంత వేషధారణలో ఉన్న హరీష్ అనే వ్యక్తి ఒక్కసారిగా జై శ్రీరాం అంటూ రాముడి వేషధారుణి పాదాలపై పడిపోయాడు. అందరూ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాడని భావించారు. కానీ ఎంతకూ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతనిని తట్టి లేపినా లేవలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. వైద్యులు గుండెపోటుతో హరీశ్ మరణించాడని తెలిపారు. దీంతో అక్కడ విషాదం నెలకొంది.


Tags:    

Similar News