తిరిగి తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు

జమ్మూకశ్మీర్‌లో పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకోనున్నాయి

Update: 2025-06-16 02:04 GMT

జమ్మూకశ్మీర్‌లో పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకోనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పర్యాటక ప్రాంతాలను మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పహాల్గాం ఉగ్రదాడిలో దాదాపు ఇరవై ఆరు మంది మరణించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 17 నుంచి...
అయితే ఇప్పుడు సాధారణ స్థితికి రావడంతో తిరిగి పర్యాటక ప్రాంతాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌లో తిరిగి ఎనిమిది పర్యాటక ప్రాంతాలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 17 నుంచి పర్యాటకులకు అందుబాటులోకి బీటాబ్ వ్యాలీ, వెరినాగ్, కొకర్నాగ్, అచబల్ గార్డెన్స్ వంటి ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించనున్నారు.


Tags:    

Similar News