నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీలివే.. షెడ్యూల్ ఇదే

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది

Update: 2026-03-15 12:38 GMT

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తో పుదుచ్చేరిలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 23వ తేదీన, రెండో విడత ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరగనుంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి కౌంటింగ్ మే 4వ తేదీన నిర్వహించనున్నారు. టీవల ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలను ఈసీఐ సమీక్షించింది. ఈ సమీక్షల్లో భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు మరియు ఎన్నికల నిర్వహణపై అధికారులు పరిశీలించారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

అసెంబ్లీ గడువు ముగిసే తేదీలు:
పశ్చిమ బెంగాల్ – మే 7
తమిళనాడు – మే 10
అస్సాం – మే 20
కేరళ – మే 23
అసెంబ్లీ స్థానాల సంఖ్య:
పశ్చిమ బెంగాల్ – 294
తమిళనాడు – 234
కేరళ – 140
అస్సాం – 126
పుదుచ్చేరి – 33
ఎన్నికల సమయంలో ఓటర్ల భద్రత, కేంద్ర సాయుధ పోలీసు బలగాల వినియోగం వంటి అంశాలపై రాజకీయ పార్టీలతో కూడా ఈసీఐ చర్చలు జరిపింది. ఇకపై ఎన్నికల సమయంలో జిల్లాల్లో సాయుధ బలగాల కదలికలను జిల్లా కలెక్టర్లు కాకుండా, ఈసీఐ నియమించే పోలీస్ పరిశీలకులు నిర్ణయిస్తారు అనే కీలక మార్పును కూడా కమిషన్ అమలు చేయనుంది.


Tags:    

Similar News