అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర విషాదం

అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర విషాదం జరిగింది.

Update: 2026-03-17 04:22 GMT

అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర విషాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారరు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటా నగర్ లోని నీతి విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అక్కడ గోడ కూలి ఏడుగురు కూలీలు శిధిలాల చిక్కుకుపోయారు.

నలుగురు మృతి
అయితే సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే నలుగురు కూలీలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News