Parlament : నేడు ఐదోరోజు కూడా అంతేనా?

నేడు ఐదోరోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమయిన పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు.

Update: 2025-07-25 02:30 GMT

నేడు ఐదోరోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమయిన పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు. గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనతో వరసగా ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఎలాంటి చర్చ జరగకుండానే, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ప్రారంభం కాకుండానే సభలు వాయిదా పడుతున్నాయి.

వాయిదాలతోనే...
నాలుగు రోజుల నుంచి తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. జీరో అవర్, ప్రశ్నోత్తరాలను రద్దు చేసి వాయిదా తీర్మానాలపై చర్చించాలని స్పీకర్ పోడియం ముందు నేతలు బైఠాయించనున్నారు. బీహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టుబడుతుండటంతో వరసగా సభలు వాయిదా పడుతున్నాయి.


Tags:    

Similar News