Congress : నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరగనుంది.
ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేడు పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపైన, ఓట్ల తొలగింపుపై కూడా చర్చించే అవకాశముంది.
పాట్నాలో జరగనున్న...
ఈ సమావేశానికి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో పాటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజులు ఇప్పటికే పాట్నాకు చేరుకున్నారు.