మైసూరు ఎయిర్‌పోర్ట్‌ వద్ద పులి కలకలం

మైసూరు ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో పులి కనిపించింది.

Update: 2026-01-08 05:16 GMT

మైసూరు ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో పులి కనిపించింది. ఈ నెల 5వతేదీన పులి కెమెరాల్లో కనిపించడంతో పరిసర గ్రామాల్లో కలకలం నెలకొంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి సమీప గ్రామాల వైపు పులి వెళ్లినట్లు గుర్తించిన మైసూరు డివిజన్‌ అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. సాయంత్రం తర్వాత బయటకు రావొద్దని, పులి ఉన్నట్లు వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.

గ్రామాల ప్రజలను...
మైసూరు–ఊటీ రహదారిపై, మైసూరు నగరానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో మైసూరు ఎయిర్‌పోర్ట్‌ ఉంది. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్ట్‌కు దారి తప్పి వచ్చిన పులి నంజనగూడ్‌ వైపు వెళ్తున్న వేగవంతమైన కారు ఢీకొట్టినట్లు తెలిపారు.పులి ఆచూకీపై అటవీ సిబ్బంది సమాచారం సేకరించారు. ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ ఉన్న ముళ్లవైర్‌ ఫెన్సింగ్‌ను దాటి పులి సమీప గ్రామాలు, పొలాల వైపు వెళ్లినట్లు గుర్తించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags:    

Similar News