ఒడిశాలో పిడుగుల వర్షం 2 గంటల్లో 61 వేల పిడుగులు 12 మంది మృతి

దీపావళికి టపాకాయలు పేలితేనే పిల్లలు, వయోజకులు ఎంతో భయానికి గురవుతారు. గుండె దడ వస్తుంది.

Update: 2023-09-04 16:49 GMT

ఒడిశాలో పిడుగుల వర్షం

2 గంటల్లో 61 వేల పిడుగులు

12 మంది మృతి

దీపావళికి టపాకాయలు పేలితేనే పిల్లలు, వయోజకులు ఎంతో భయానికి గురవుతారు. గుండె దడ వస్తుంది. చెవులు చిల్లులు పడతున్నాయా అనిపిస్తుంది.. అలాంటిది 2 గంటలపాటు ఏకధాటిగా పిడుగుల వర్షం అంటే మాటలా ? గుండెలవిసి పోవూ ? ఎంతమంది దేవుళ్లున్నారో అంతమందిని ఆదుకోమని ఏకరువు పెట్టమూ ?

వాతావరణ శాఖ మేరకు ఈరోజు (సెప్టెంబర్ 4న) ఒడిశాకు పిడుగుల హెచ్చరిక చేసింది. అందులో కటక్, ఖుద్రా,పూరీ మరో 21 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన పిడుగులతో 12 మంది చనిపోగా, మరో 14 మంది గాయాలపాలైయ్యారు. దీంతోపాటు 8 పశువులు కూడా చనిపోయాయని ప్రత్యేక విపత్తుల నిర్వహణాశాఖ కమిషనర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. రెండు గంటల్లో దాదాపు 62 వేల పిడుగులు పడటం, ఆ శబ్దాలను భరించడం మాటలు కాదు. ఖుద్రా జిల్లాలో నలుగురు, బాలన్ గిరిలో 2, అంగుల్, బౌద్ధ్ ఢినెకనల్ , గజపతి, జగత్ సింగ్ పూర్ , పూరీలో ఒక్కొక్కటి జరిగిందని అధికారులు వెల్లడించారు. బాలన్ గిరిలో 8 మంది, ఖుద్రాలో ముగ్గురు, అంగుల్, కటక్, గంజపాటిల్లో ఒక్కొక్కరు గాయపడ్డారన్నారు. గంజపాటిలో 6 పశువులు, కాంధమల్ లో రెండు మృతి చెందాయన్నారు. వీటికి కూడా నష్టపరిహారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. 2021-2022ల్లో 281 మంది, 2020-2021ల్లో 291 మంది మృతి చెందారన్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags:    

Similar News