Lemon : ఈ నిమ్మకాయ ఖరీదు 35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటంటే?

తమిళనాడులోని ఈరోడ్‌లోని శివగిరి గ్రామోంలో ఉన్న పఠపూశయన్ దేవాలయంలో జరిగిన వేలంలో నిమ్మకాయ ధర 35 వేలు పలికింది

Update: 2024-03-11 04:25 GMT

Lemon :నిమ్మకాయ.. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబర్చేందుకు వినియోగిస్తారు. నిమ్మకాయ మజ్జిగ తాగినా, కనీసం నిమ్మకాయ సోడా తాగినా సరే శరీరంలో వేడి తగ్గుతుంది. అందుకే వేసవికాలంలో నిమ్మకాయకు అంత డిమాండ్. మార్కెట్ లో సమ్మర్ లో ఎక్కువగా అమ్ముడుపోయేది కూడా ఈ నిమ్మకాయలే. నిమ్మరసాన్ని పిండుకుని నీటిలో లేదా మజ్జిగలో కలుపుకుని తాగినా సరే శరీరం చల్లబడుతుంది. వేడి తమ దరి చేరదు. నిమ్మకాయలో సి విటమిన్ ఉండటం కూడా ఎక్కువ మంది వినియోగించడానికి మరో కారణం.

వేసవి కాలంలో...
అయితే ఒక నిమ్మకాయ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రెండు రూపాయలు. లేదు డిమాండ్ ఎక్కువగా ఉండి పంట పెద్దగా రాని సమయంలో ఐదురూపాయలకు నిమ్మకాయ ధర మించదు. కానీ ఇప్పుుడు చూస్తున్న ఈ నిమ్మకాయను ఒకరు ఏకంగా ముప్పయి అయిదువేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. నమ్మకపోయినా నిజం. మూఢవిశ్వాసం అనుకోండి.. నమ్మకమని భావించండి. నిమ్మకాయను 35 వేలు పెట్టి సొంతం చేసుకుని మరీ సంబరపడ్డాడో వ్యక్తి.
వేలంలో సొంతం చేసుకుని...
తమిళనాడులోని ఈరోడ్‌లోని శివగిరి గ్రామోంలో ఉన్న పఠపూశయన్ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఇటీవల జరిగాయి. శివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులు శివునికి నిమ్మకాయను సమర్పిస్తుంటారు. తమకు తోచిన వస్తువులను కూడా ఇస్తుంటారు. అయితే పఠపూశయన్ ఆలయ అధికారులు వస్తువులను వేలం వేస్తుంటారు. ఈ వేలంలో నిమ్మకాయను వేలం వేశారు. ఈ వేలంలో మొత్తం పదిహేను మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోడ్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ నిమ్మకాయను 35 వేలకు తన సొంతం చేసుకున్నాడు. శివుడి దగ్గర ఉంచిన ఈ నిమ్మకాయను సొంతం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయన్న నమ్మకమే నిమ్మకాయకు అంత ధర పలికింది.


Tags:    

Similar News