టీసీఎస్ లో 12 వేల మందికి ఉద్వాసన

టీసీఎస్ లో పన్నెండు వేల మందిని ఉద్యోగాలను తప్పించాలని నిర్ణయం తీసుకుంది

Update: 2025-07-28 03:05 GMT

టీసీఎస్ లో పన్నెండు వేల మందిని ఉద్యోగాలను తప్పించాలని నిర్ణయం తీసుకుంది. వ్యయం తగ్గిపు చర్యల్లో భాగంగా టీసీఎస్ ఉద్యోగుల్లో కోతను విధించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉద్యోగులను తొలగించనున్నట్లు టీసీఎస్ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటికే అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో టీసీఎస్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే...
2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండు శాతం మంది సిబ్బందిని తొలగించనున్నట్లు టీసీఎస్ ప్రకటించడంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎక్కువగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఖర్చును తగ్గించుకునే భాగంలో ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీసీఎస్ తెలిపింది.


Tags:    

Similar News