Tamilnadu : తమిళనాడులో 39 మంది ప్రాణాలు బలి.. విజయ్ సభలో తొక్కిసలాటకు కారణం అదేనట

మిళనాడులోని కరూర్ లో జరిగిన టీవీకే అధినేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 39 మంది వరకూ మరణించారు

Update: 2025-09-28 03:14 GMT

తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో జరిగిన విషాదానికి బాధ్యులెవరు? విజయ్ గత కొద్ది రోజుల నుంచి ఎన్నికల ప్రచార సభలను తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆయన సభలకు విపరీతంగా అభిమానులు, ప్రజలు తరలి వస్తున్నారు. అయితే నిన్న రాత్రి తమిళనాడులోని కరూర్ లో జరిగిన టీవీకే అధినేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 39 మంది వరకూ మరణించారు. ఈ నెుల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించిన విజయ్ అనేక చోట్ల జనం పోటెత్తుతుండటం చూశారు. పోలీసులు కూడా వారిని కట్టడి చేయలేని పరిస్థితి. కరూర్ వద్ద ఉన్నవేలు సామిపురంలో విజయ్ రాత్రి 7.30 గంటలకు సభ జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. పిల్లలు, మహిళలు, వృద్ళులు ఈ తొక్కిసలాటలో మరణించారు.

చిన్నారులు, మహిళలు,వృద్ధులు....
మొత్తం 39 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అందులో చిన్నారులు పదహారు మంది ఉంగా, మహిళలు, వృద్ధులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వెంటనే తన ప్రసంగాన్ని నిలిపేసి విజయ్ వారిని తోసుకోవద్దంటూ చేసిన విజ్ఞప్తిని పట్టించుోలేదు. అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. యాభై మంది వరకూ గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో ఇరవై మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే విజయ్ ను దగ్గర నుంచి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం వెంటనే ఏకసభ్య విచారణకు ఆదేశించింది.
ఏకసభ్య కమిషన్...
ముఖ్యమంత్రి స్టాలిన్ కరూర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు అందుతున్న చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శిస్తారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లిస్తున్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీనిపై హీరో విజయ్ కూడా స్పందించారు. తన హృదయం ముక్కలైందని, తాను భరించలేని బాధ, విషాదంలో ఉన్నానని తెలిపారు. ఈ బాధను పదాల్లో వర్ణించలేనని చెప్పారు. ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. అయితే
ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం విజయ్ సభకు ముందు సరిగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయకపోవడమేనని అంటున్నారు. విజయ్ పది గంటలకు వస్తామని రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారని, పది వేల మందికి సభకు అనుమతి తీసుకుని లక్షల మంది జనాన్ని సమీకరించారని రాష్ట్ర డీజీపీ తెలిపారు.

















Tags:    

Similar News