శ్రీలంకలో అదానీ కోసం ప్రధాని పైరవీ

శ్రీలంకలో విద్యుత్తు ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలనిమోదీ ఒత్తిడి తెచ్చారంటూ విద్యుత్ బోర్డు చీఫ్ ఫెర్డినాండో ఆరోపించారు

Update: 2022-06-14 02:31 GMT

భారత్ లోనే కాకుండా పొరుగున ఉన్న దేశంలోనూ అదానీ ప్రాజెక్టుల కోసం పైరవీలు జోరుగా సాగుతున్నాయి. అందులో ప్రధాన మోదీ పేరు వినిపిస్తుండటం విశేషం. శ్రీలంకలో విద్యుత్తు ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారంటూ ఆ దేశ విద్యుత్ బోర్డు చీఫ్ ఫెర్డినాండో ఆరోపించారు. అదానీ గ్రూపునకు పవర్ ప్రాజెక్టు ఇవ్వాలంటూ వత్తిడి తేవటం నిజమేనంటూ ఆయన చెప్పడం విశేషం. ఆయన తన పదవికి రాజీనామా చేశారు కూడా.

విద్యుత్తు ప్రాజెక్టును....
విద్యుత్తు ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని, ప్రధాని మోదీ వత్తిడి తెస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స తనకు చెప్పారని ఫెర్డినాండో ఆరోపించారు. ఈ ఆరోపణలతో అదానీ, మోదీల బంధంపై భారత్ లో విస్తృతంగా చర్చ జరగుతుంది. ఫెర్డినాండో వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విపక్షాలకు అస్త్రాలుగా దొరికాయి. అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకపై ప్రధాని మోదీ ఒత్తిళ్లేమిటంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ కమిటీ ఎదుట ఫెర్డినాండో తెలిపారు. అయితే ఈ విమర్శలను శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స తోసిపుచ్చారు. మొత్తం మీద శ్రీలంకలోనూ అదానీ కోసం ప్రధాని మోదీ పైరవీ చేశారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.


Tags:    

Similar News