Corona Virus : కరోనా వైరస్ అప్‌డేట్
భారత్ లో కరోనా కేసులు వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
corona virus cases
Covid-19 corona virus cases:భారత్ లో కరోనా కేసులు వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఐదుగురు మరణించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 4,049 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.
మాస్క్ ధరించేలా....
ప్రధానంగా కేరళ, కర్ణాటక, గుజరాత్‌లలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రద్దీ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్ ను ధరించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు అందాయి. ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. రానున్నది పండగ సీజన్ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.