నేడు సూర్యగ్రహణం
నేడు సూర్యగ్రహణం రాబోతుంది. అయితే భారత్ లో మాత్రం ఈ ప్రభావం కనిపించదని అంటున్నారు
నేడు సూర్యగ్రహణం రాబోతుంది. అయితే ఈ ఏడాదిలో ఇది రెండో పాక్షిక సూర్యగ్రహణం అని చెబుతున్నారు. ఆదివారం అమావాస్య నాడు సూర్యగ్రహణం కావడంతో చెడు ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం ప్రభావం భారత్ లో ఉండదని కూడా చెబుతున్నారు. సూర్యగ్రహణం భారత్ లోనూ కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో భారత్ లో సూతక కాలం ఉండదని పండితులు చెబతుున్నారు.
భారత్ పై ప్రభావం...
చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల సూర్యకాంతి కొంత మయేర తగ్గుతుందని, ఈరోజు రాత్రి 10.59 గంటలకు ప్రారంభమై రేపు తెల్లవారు జామున 3.23 గంటల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి సూర్యగ్రహణం అని అంటున్నారు. భారత్ లో మాత్రం ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉంటదని అంటున్నారు. సూర్యుడిని చూడాలనుకుంటే నేరుగా చూడకుండా బైనాక్యులర్స్, ఆప్టికల్స్ సాయంతో చూడాలని ఖగోళ నిపుణులు సూచిస్తున్నారు.