సిక్కింలో భారీ హిమపాతం.. ఆరుగురు మృతి

ప్రమాదంలో గాయపడిన వారిని గ్యాంగ్ టక్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హిమపాతం బారిన పడిన 22 మంది..

Update: 2023-04-04 11:51 GMT

sikkim alavanche tragedy

సిక్కిం లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గ్యాంగ్ టక్ లో భారీ హిమపాతం విధ్వంసం సృష్టించింది. మంగళవారం గ్యాంగ్ టక్ లో వచ్చిన హిమపాతం కారణంగా ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. హిమపాతంలో చిక్కుకున్న 350 మందిని రక్షించారు. కాగా.. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హిమపాతం సంభవించింది.

ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. గ్యాంగ్ టక్, నాథులా పాస్ లను కలిపే జవహర్ లాల్ నెహ్రూ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని గ్యాంగ్ టక్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హిమపాతం బారిన పడిన 22 మంది పర్యాటకులను వెంటనే రక్షించారు. రోడ్డుపై ఉన్న మంచును తొలగించిన తర్వాత 350 మంది పర్యాటకులు, మంచులో చిక్కుకున్న 80 వాహనాలను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అక్కడ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతమైన నాథులా చైనా సరిహద్దులో ఉండగా.. ఇక్కడ ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రతిఏటా లక్షలాది పర్యాటకులు వస్తుంటారు.


Tags:    

Similar News