షిండే కు భద్రత తొలగింపు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీకి శివసేన అసమ్మతి నేత ఏక్‌నాధ్ షిండే లేఖ రాశారు.

Update: 2022-06-25 05:54 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీకి శివసేన అసమ్మతి నేత ఏక్‌నాధ్ షిండే లేఖ రాశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కాని, తన కుటుంబ సభ్యులకు కాని ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని షిండే లేఖలో పేర్కొన్నారు. భద్రత తొలగింపుపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

16 మంది ఎమ్మెల్యేలపై....
కాగా గౌహతిలో ఉన్న ఏక్‌నాధ్ షిండే క్యాంప్ లో ప్రస్తుతం యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండే క్యాంప్ కు క్యూ కడుతున్నారు. మరోవైపు షిండే క్యాంప్ లో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ కార్యదర్శికి శివసేన లేఖ ఇచ్చింది. దీనిపై న్యాయనిపుణులతో అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం సంప్రదింపులు జరుపుతుంది. న్యాయనిపుణుల సూచనల మేరకు చర్యలు ఉంటాయని చెబుతున్నారు.


Tags:    

Similar News