సుప్రీంలో ఉద్ధవ్ కు షాక్

సుప్రీంకోర్టులో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కు షాక్ తగిలింది

Update: 2022-09-27 13:13 GMT

సుప్రీంకోర్టులో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కు షాక్ తగిలింది. అసలైన శివసేన ఎవరిదని గుర్తించే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారం ఎన్నికల కమిషన్ కు ఉందని తెలిపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలను చేపట్టిన ఏక్ నాథ్ షిండే వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి ఈ వ్యాఖ్యలను చేసింది.

ఈసీకి ఆ అధికారం...
మహారాష్ట్రలో శివసేన నుంచి వేరు కుంపటి పెట్టుకుని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కలసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మెజారిటీ ప్రకారం శివసేన పార్టీ కూడా తమదేనని షిండే పిటీషన్ వేశారు. ఆ అధికారం ఈసీకి లేదని ఉద్ధవ్ ధాక్రే పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కు శివసేన ఎవరిది అని గుర్తించే అధికారం ఉందని చెప్పింది.


Tags:    

Similar News