దాతృత్వంలో అగ్రగామి శివ్‌ నాడార్‌

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ తన దానగుణాన్ని మరోసారి చాటుకున్నారు.

Update: 2025-11-07 13:50 GMT

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ తన దానగుణాన్ని మరోసారి చాటుకున్నారు. 2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్‌ నాడార్‌ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. ఆయన కుటుంబం 2025లో 2,708 కోట్లు దానం చేసినట్లు 2025 సంవత్సరం ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రఫి జాబితా ద్వారా తెలిసింది. అంటే రోజుకు 7.4 కోట్ల రూపాయలు సమాజానికి తిరిగి ఇచ్చారు. గత అయిదేళ్లలో మన దేశంలో అత్యంత దానశీలిగా శివ్‌ నాడర్‌ నిలవడం ఇది నాలుగోసారి. తర్వాతి స్థానాల్లో ముకేశ్‌ అంబానీ, బజాజ్‌ కుటుంబం, కుమార్‌ మంగళం బిర్లా కుటుంబం, గౌతమ్‌ అదానీ కుటుంబం ఉన్నాయి. దానశీలుర జాబితాలో ముంబయి నుంచి 28%, ఢిల్లీ నుంచి 17%, బెంగళూరు నుంచి 8% మంది ఉన్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద జరుగుతున్న కేటాయింపులు అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్‌కు వెళ్తున్నాయి.

Tags:    

Similar News