నేటి నుంచి జమ్మూకాశ్మీర్ లో పాఠశాలలు ప్రారంభం
నేటి నుంచి జమ్మూకాశ్మీర్ లో పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయి
నేటి నుంచి జమ్మూకాశ్మీర్ లో పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయి. ఇటీవల భారత్ - పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ వరసగా జరుపుతున్న దాడులతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. పాక్ స్కూళ్లను కూడా లక్ష్యంగా చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కాల్పుల విరమణ ఒప్పందంతో...
అయితే పాక్ - భారత్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాటు చర్చలు కూడా ప్రారంభం కావడంతో సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తొలిగాయి. దీంతో తిరిగి పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి సాంబ, విజయ్ పుర, బర్నోటి, లఖన్ పూర్, రాజౌరి ప్రాంతాల్లో పాఠశాలలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.