ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపు
ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
ఢిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాదాపు ఇరవై స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో బాంబు స్క్కాడ్ తనిఖీలను చేస్తుంది. ఆకతాయిలు చేసిన పనా? లేక నిజంగా బాంబు బెదిరింపులు వచ్చాయా? అన్న కోణంలో దర్యాప్తు జరగుతోంది. వచ్చిన ఈ మెయిల్స్ ను పరిశీలిస్తున్నారు. పోలీసులు ఇరవై పాఠశాలల నుంచి విద్యార్థులను టీచర్లను బయటకు పంపించి వేశారు.
ఆకతాయిల పనే...
పాఠశాలల్లో బాంబులు ఉన్నాయేమోనని తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఆకతాయిల పనే అయి ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఒకే వ్యక్తి ఇరవై పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పెట్టినట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం సాంకేతిక పరిజ్ఞానంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.