అశోక్ రాణా దిద్దిన సామ్రాట్
ఈజిప్టు రాజధాని కైరోలో నిర్వహించిన ISSF వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సామ్రాట్ రాణా గోల్డ్ కొట్టాడు.
ఈజిప్టు రాజధాని కైరోలో నిర్వహించిన ISSF వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సామ్రాట్ రాణా గోల్డ్ కొట్టాడు. 22 ఏళ్ల సామ్రాట్ రాణా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 243.7 స్కోర్‌తో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. సామ్రాట్ నాన్న అశోక్ రాణా కూడా ఒకప్పుడు షూటర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ సాధించలేకపోయాడు. కానీ కొడుకు కోసం ఏది చేయడానికైనా ముందుకు వచ్చాడు. తనకున్న వ్యవసాయ క్షేత్రంలో 2017లో ఓ షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేశాడు. 12 సంవత్సరాల వయసులో తండ్రి సిద్ధం చేసిన షూటింగ్ బరిలో లక్ష్యంపై గురిపెట్టిన తనయుడు ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటడం మొదలు పెట్టాడు.