రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైలులో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వే ట్రిప్ ప్యాకేజీ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది
Good news for Tirupati pilgrims: 32 special trains from Hyderabad during summer holidays for smooth and comfortable travel.
రైలులో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వే ట్రిప్ ప్యాకేజీ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రిటర్న్ టిక్కెట్ బేస్ ఫేర్ పై దాదాపుగా ఇరవై శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే వెళ్లేటప్పుడు, వచ్చే టప్పుడు టిక్కెట్ ను కూడా బుక్ చేసుకున్న వారికే ఈ వెసులుబాటు లభిస్తుంది. రెండు వైపులా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని భారత రైల్వే శాఖ తెలిపింది.
షరతులు ఇవీ...
ఈ పథకం ఆగస్టు 14వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అయితే ఇందులో మరొక షరతు కూడా ఉంది. రౌండ్ ట్రిప్ పథకం కింద ప్రయాణికులు ఫస్ట్ జర్నీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ మధ్యలో టిక్కెట్ బుక్ చేసుకున్న తర్వాత రిటర్న్ జర్నీ టిక్కెట్ ను నవంబరు పదిహేడో తేదీ నుంచి డిసెంబరు 1వతేదీలోగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టిక్కెట్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే ఈ రాయితీ లభిస్తుంది. అలాగే రెండు వైపులా ప్రయాణానికి సంబంధించి ఒకే క్లాస్ లో బుక్ చేసుకోవాలి. స్పెషల్ ట్రెయిన్స్ తో పాటు అన్ని రకాల రైళ్లకు ఈ రాయితీ వర్తిస్తుంది.