నేడు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి
మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ముంబయిలో మున్సిపల్ ఎన్నికలు నిన్న ముగిసన నేపథ్యంలో నేడు ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఉదయం పది గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ముంబయితో పాటు మొత్తం 28 కార్పొరేషన్లకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు.
రెండు కూటమిల మధ్య...
ముంబయిలో బీజేపీ కూటమి, థాక్రేల కూటమిల మధ్య పోటీ తీవ్రంగా ఉందని అక్కడి మీడియా తెలిపింది. ఏడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడంతో ఈ పోటీలో ఎవరిది గెలుపు అన్నది ఉత్కంఠగా మారింది. ముంబయి కార్పొరేషన్ లోని మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పోటీ తీవ్రంగానే జరిగింది. ఎవరిది ముంబయిపై పై చేయి అవుతుందన్నది కాసేపట్లో తెలియనుంది.