ఆర్బీఐ కొత్త రూల్స్... అప్పులు వసూలు చేయాలంటే?

రుణాల వసూలులో రికవరీ ఏజెంట్లు చేస్తున్న దారుణాలను అరికట్టేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలను తీసుకు వచ్చింది

Update: 2022-08-13 03:15 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రుణాల వసూలులో రికవరీ ఏజెంట్లు చేస్తున్న దారుణాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలను తీసుకు వచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగేతర సంస్థలు, వాణిజ్య బ్యాంకులు తమ రుణ రికవరీ ఏజెంట్లు ఖచ్చితంగా ఈ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ నూతనంగా ఆదేశాలు జారీ చేసింది.

ఇష్టారాజ్యంగా....
ఇప్పటి వరకూ ఇష్టారాజ్యంగా బ్యాంకుల రుణాల రికవరీ ఏజెంట్లు భయభ్రాంతులకు గురి చేయడం, మానసిక హింసకు గురి చేయడంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఆర్బీఐ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే రుణ రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. మానసికంగా, భౌతికంగా వేధించకూడదని నూతన ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags:    

Similar News