సంక్రాంతి ముందు రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ షాక్
రైల్వే శాఖ ప్రయాణికులకు షాకిచ్చింది. ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది
రైల్వే శాఖ ప్రయాణికులకు షాకిచ్చింది. ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 26 నుంచి భారతీయ రైల్వేశాఖ టికెట్ ధరలను సవరిస్తూ ప్రకటన చేసింది. పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేస్తూ, ఎక్కువ మందికి రైల్వే సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 215 కి.మీల కంటే తక్కువ దూరం ఆర్డినరీ క్లాస్‌లో ఛార్జీలు పెంచలేదు.
మరో నాలుగు రోజుల్లో...
అంతకంటే ఎక్కువ దూరానికి ఆర్డినరీ క్లాస్‌లో కిలోమీటరుకు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు. నాన్-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ ప్రయాణానికి అదనంగా రూ.10 చెల్లించాలి. ఈ మార్పుల వల్ల రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. మరో నాలుగు రోజుల్లో పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.