రైల్లో వెళుతున్నారా? అయితే మీ లగేజీని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే

రైల్వే ప్రయాణికులకు భారం పడనుంది. ఇష్టమొచ్చిన తరహాలో తమ వెంట లగేజీని తీసుకు వెళ్లడానికి వీలులేదు

Update: 2025-08-21 04:45 GMT

రైల్వే ప్రయాణికులకు భారం పడనుంది. ఇష్టమొచ్చిన తరహాలో తమ వెంట లగేజీని తీసుకు వెళ్లడానికి వీలులేదు. దానికీ ఒక ఇకపై లెక్కుండేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కీలక నిబంధన అమలులోకి రావడంతో ప్రయాణికులు తమ వెంట తీసుకునే లగేజీపై పరిమితులు మేరకు లగేజీ రుసుము కూడా చెల్లించాల్ిస ఉంటుంది. పరిమితికి మించి అధిక లగేజీ ఉంటే దానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ విమానాశ్రయాలకే పరిమితమైన ఈ నిబంధన ఇకపై రైలు ప్రయాణాల్లో వర్తించేలా మార్పు తీసుకువచ్చింది.

తప్పకుండా తనిఖీకి...
ఈ నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ లగేజీని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లలో తప్పకుండా తనిఖీ చేయించుకోవాలి. రైల్వే శాఖ ప్రతి కోచ్కు నిర్దిష్ట బరువు పరిమితులను నిర్ణయించింది. ఈ పరిమితులను మించి లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ కోచ్ లలోప్రయాణించే వారికి నిర్దిష్టమైన లగేజీ తీసుకెళ్లాలని నిబంధనను విధించింది. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు డెబ్భయి కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. దీనికి అదనంగా 15 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
లగేజీ పరిమితి ఇలా...
ఏసీ టూ టైర్ కోచ్ లో అయితే యాభై కిలోల లగేజీ వరకూ ఉచితం. అదనంగా 10 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లవచ్చు. ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్ లో ప్రయాణికులకు నలభై కిలోల వరకు లగేజీ ఉచితం. దీనికి అదనంగా 10 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లే అవకాశం ఉంది. సెకండ్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికులకు 35 కిలోల వరకు లగేజీ ఉచితంగా అనుమతిస్తారు. దీనికి అదనంగా 10 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లే వీలుంది. పరిమితిని మించి లగేజీని తీసుకెళ్లేవారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణ సమయంలో టీటీఈ తనిఖీ చేసి, బుక్ చేయని అదనపు లగేజీని గుర్తించినట్లయితే, సాధారణ ఛార్జీల కంటే ఆరు రెట్లు ఎక్కువ ఫైన్ విధించే అవకాశం ఉంది.


Tags:    

Similar News