Narendra Modi : రెండు రోజులు గుజరాత్ పర్యటనకు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది.

Update: 2025-08-25 04:01 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. అహ్మదాబాద్ లో నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నార. ఈరోజు ఖోడలల్దామ్ మైదానంలో జరిగే ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. దీంతో అహ్మదాబాద్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నికోల్ లో రోడ్డును మూసివేసి ఆంక్షలు విధించారు.

వివిధ కార్యక్రమాలకు...
ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు పోలీసులు సూచించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ రైల్వేలు, రహదారులు, పట్టణాభివృద్ధికి సంబంధించి 5,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రేపు సుజుకి హన్సల్ పూర్ ప్లాంట్ ను సందర్శించి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. దీంతో పాటు సుజుకి ఇ విటారా ఎగుమతులను వంద దేశఆలకు పంపించే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News