‍Narendra Modi : నేడు అటల్ వంతెన ప్రారంభం

దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు

Update: 2024-01-12 04:07 GMT

longest sea bridge

దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాణిజ్యనగరమైన ముంబయిలో నిర్మించిన ఈ అతి పెద్ద వంతెనను నేడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింక్ ను ప్రారంభించడంతో ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు. ముంబయిలో నేని సేవ్రీ నుంచి రాయ్‌గడ్ జిల్లాలో సహవా శేవాను కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన నిర్మించారు.

21 వేల కోట్ల వ్యయంతో...
ప్రస్తుతం ముంబయి - నవీ ముంబయి మధ్య రెండు గంటల సమయం పడుతుండటంతో ఈ వంతెన నిర్మాణంతో కేవలం పదిహేను నిమిషాల్లోనే చేరుకునే వీలుంది. ఈ వంతెన నిర్మాణానికి 21 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఈ వంతెన కు మాజీ ప్రధాని పేరు అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును పెట్టడం విశేషం.


Tags:    

Similar News