నేడు ప్రయాగ్ రాజ్ కు నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహా కుంభమేళాకు వెళ్లనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఆయన పుణ్యస్నానాలు చేయనున్నారు

Update: 2025-02-04 04:11 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహా కుంభమేళాకు వెళ్లనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఆయన పుణ్యస్నానాలు చేయనున్నారు. మోదీ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మోదీ నేడు మహా కుంభమేళాకు వచ్చిఅక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పుణ్యస్నానాలు ఆచరించి...
మహా కుంభమేళా ఈ నెల 26వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే నిన్న వసంత పంచమి రోజు ఒక్కరోజు రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈరోజు రథసప్తమి కావడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది.


Tags:    

Similar News