Narendra Modi : నేడు పోలవరంపై ప్రధాని సమీక్ష

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం నిర్వహించనున్నారు

Update: 2025-05-28 02:51 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి పై ప్రధాని మోదీ జీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు.ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు నలుగురు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.

తొలిసారి పోలవరంపై...
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తుండటంతో ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఒడిశా ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు మోహన్ చరణ్ విష్ణుదేవ్ సాయి ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సును ప్రధాని మోదీ నిర్వహించనున్నారు.


Tags:    

Similar News