Bank Notification : నిరుద్యోగులకు ఎస్.బిఐ. గుడ్ న్యూస్
ఎస్.బి.ఐ. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఎస్.బి.ఐ. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్దయెత్తున పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో Circle Based Officer (CBO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం.
ముఖ్య వివరాలు:
పోస్ట్ పేరు: Circle Based Officer
మొత్తం పోస్టులు: 2273
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో
పోస్టింగ్: అప్లై చేసిన సర్కిల్‌లోనే
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 29 జనవరి 2026
చివరి తేదీ: 18 ఫిబ్రవరి 2026
ఆన్‌లైన్ పరీక్ష: మార్చి 2026 (అంచనా)
అర్హత:
ఏదైనా డిగ్రీ
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ / RRB లో
కనీసం 2 సంవత్సరాల ఆఫీసర్ అనుభవం తప్పనిసరి
వయస్సు (31-12-2025 నాటికి)
కనీసం: 21 సంవత్సరాలు
గరిష్టం: 30 సంవత్సరాలు
SC / ST / OBC / PwBD వారికి వయో సడలింపు ఉంది
జీతం & ప్రయోజనాలు:
ప్రాథమిక జీతం: ₹48,480/-
DA, HRA, CCA, NPS, మెడికల్, LFC వంటి అలవెన్సులు
ఎంపిక విధానం:
1. Online Test (Objective + Descriptive)
2. Screening3. Interview
4.Local Language Test