Narendra Modi : బెదిరింపులకు భయపడం.. వెనకడగు వేయబోం

ఎందరి త్యాగాల ఫలితమో నేడు స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎర్రకోట నుంచి 12వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Update: 2025-08-15 03:05 GMT

ఎందరి త్యాగాల ఫలితమో నేడు స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎర్రకోట నుంచి 12వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నాడు సాధించిన స్వాతంత్ర్య ఫలాలనే నేడు అనుభవిస్తున్నామని చెప్పారు. దాదాపు 140 కోట్ల మంది సంకల్ప పండగ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగగరే సమయం ఇదేనని మోదీ అన్నారు. జాతీయ భావన ఉప్పొంగే సమయం నేడు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తనకు యువత, శక్తి సామర్థ్యాలపై అపారమైన నమ్మకం ఉందని అన్నారు. మన దేశ యువత అన్ని రంగాల్లో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళుతుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.

అణు రియాక్టర్లపై...
త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ రాజ్యమేలుతాయని మోదీ తెలిపారు. పది కొత్త అణు రియాక్టర్ల పనులను వేగం పెంచుతామన్న మోదీ 2047 నాటికి పది రెట్లు న్యూక్లియర్ ఎనర్జీని పెంచుతామని మోదీ తెలిపారు. ప్రపంచమంతా నేడు కీలక ఖనిజాలపై ఆసక్తి చూపుతుందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పు అని ప్రధాని మోదీ అన్నారు. పహాల్గాం దాడిని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమాయకులను మతం పేరు అడిగి కాల్చి చంపారని అన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకున్నామన్న మోదీ ఆపరేషన్ సింధూర్ తో శత్రువులను ఊహించని రీతిలో దెబ్బతీశామని ప్రధాని మోదీ చెప్పారు. శత్రుమూకలను లక్ష్యం, సమయం ఎంచుకుని దాడి చేసేందుకు పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలకు ఇచ్చామని తెలిపారు.
సింధూ జలాల ఒప్పందంపై...
అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడే ప్రసక్తి లేదని మోదీ పరోక్షంగా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి చెబుతున్నానని, నీరు, రక్తం కలసి ప్రవహించవని ఆయన స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదని మోదీ కుండబద్దలు కొట్టారు. సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లిస్తామని, నీరు లేని ప్రాంతాలకు వాటిని తరలిస్తామని తెలిపారు. అమృత్ భారత్ మన నినాదం కావాలని మోదీ అన్నారు. సమృద్ధ్ భారత్ మన అజెండా కావాలని మోదీ ఆకాంక్షించారు. అనేక సంస్కరణల మూలంగానే భారత్ నేడు అగ్ర రాజ్యాల సరసన తలెత్తుకునేలా నిలిచిందని మోదీ తెలిపారు. సైబర్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ లో భారత్ కీలక భూమిక పోషిస్తుందని మోదీ తెలిపారు. త్యాగాలు చేసిన సైనికులకు తన వందనాలు తెలిపారు.
Tags:    

Similar News