మావోయిస్టుల ఎన్ కౌంటర్ ప్రధాని మోదీ రెస్పాన్స్ ఇదే

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మావోయిస్టులపై అతిపెద్ద విజయంగా ఆయన అన్నారు

Update: 2025-05-21 11:38 GMT

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మావోయిస్టులపై అతిపెద్ద విజయంగా ఆయన అన్నారు. దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా ఆపరేషన్ మావోయిస్టు కార్యక్రమం చేపట్టినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మావోయిజం మూలాలను చెరిపేస్తున్నామన్నప్రధాని మోదీ శాంతి భద్రతల కోసం మావోయిస్టులను అంతంచేస్తామని చెప్పారు.

శాంతి భద్రతలను పరిరక్షించడంలో...
కాగా ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో ఈరోజు ఇరవై ఏడు మంది మావోయిస్టులు మరణించడంపై ఆయన స్పందించారు. భద్రతాదళాల విజయం చూసి గర్వంగా ఉందన్న మోదీ, మావోయిజాన్ని తుదముట్టించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అడవుల్లో ఉంటూ అభివృద్ధికి అడ్డంపడుతూ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోదీ అన్నారు. మావోయిస్టుల అగ్రనేతలు కూడా మరణించడంతో మావోలకు ఇది ఎదురుదెబ్బగా మోదీ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఎక్స్ లో మోడీ పోస్టు చేశారు.


Tags:    

Similar News