Narendra Modi : ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానాలు ఆచరించారు.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానాలు ఆచరించారు. ఉదయం పదకొండు గంటలకు ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న మోదీకి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తో పాటు మంత్రులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత మోదీ, యోగి ఆదిత్యానాధ్ కలసి గంగా నదిలో పడవలో తిరిగారు.
భీష్మ అష్టమి కావడంతో...
నేడు భీష్మ అష్టమి కావడంతో ఈరోజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే మంచిదని భావిస్తారు. అందుకోసమే ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. మోదీ ప్రయాగ్ రాజ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలోతరలి వస్తుండటంతో వారికి ఇబ్బంది కలగకుండా ప్రధాని మోదీ ఒక ప్రత్యేక ఘాట్ లో స్నానమాచరించారు.