Narendra Modi : పంచెకట్టులో తమిళనాడులో మోదీ

తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు.

Update: 2025-07-27 03:15 GMT

తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పంచెకట్టుతో తమిళనాడులో అడుగుపెట్టిన మోదీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన అనంతరం శ్రీరాముడి పవిత్ర భూమికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు. తమిళనాడులో నేడు గంగైకొండ చోళపురాన్ని సందర్శించనున్నారు. 

ప్రారంభోత్సవాల్లో...
తమిళనాడులో వరసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో మోదీ తమిళనాడు పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు మోదీ వివరించారు.


Tags:    

Similar News