అహ్మదాబద్ లో ప్రధాని నరేంద్ర మోదీ
అహ్మదాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు
అహ్మదాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ వెంటనే బీజే మెడికల్ హాస్టల్ ను పరిశీలించారు. విమాన ప్రమాదంలో ధ్వంసమయిన హాస్టల్ భవనాలను ప్రధాని మోదీ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న ప్రధాని మోదీ వారితో మాట్లాడనున్నారు.
క్షతగాత్రులకు పరామర్శ...
దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించనున్నారు.తర్వాత ప్రధధానినరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యే అవకాశముంది.