ఈ గుర్రం ధర ఐదు కోట్లు.... అయినా?

మహరాష్ట్రలో ఒక గుర్రం ధర ఏకంగా ఐదుకోట్లు పలికింది. అయినా దాని యజమాని మాత్రం తాను ససేమిరా ఇవ్వనన్నాడు.

Update: 2021-12-24 02:21 GMT

గుర్రానికి ఐదు కోట్లా? ఆశ్చర్యపోకండి. కొనేవాళ్లుంటారు. గుర్రాలను పెంచడం ఒక హాబీ. అలాగే వాటిపై స్వారీ చేయడం కూడా ఒక సరదా. కొందరైతే రేసులకు కూడా వాడుతుంటారు. ఇలా గుర్రాలను పెంచుకోవడం ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఇప్పుడు మహరాష్ట్రలో ఒక గుర్రం ధర ఏకంగా ఐదుకోట్లు పలికింది. అయినా దాని యజమాని మాత్రం తాను ససేమిరా ఇవ్వనన్నాడు. అమ్మకపోయినా గుర్రానికి అంత రేటు పలకడం చర్చనీయాంశంగా మారింది

మార్వార్ జాతికి....
మహరాష్ట్రలోని సందూర్బర్ జిల్లా సారంగ్ ఖేడ్ లో గుర్రాల మార్కెట్ ఉంది. ఇక్కడ అనేక రకాలు జాతులకు చెందిన గుర్రాలను విక్రయిస్తుంటారు. నాసిక్ కు చెందిన ఒక గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వచ్చారు. నాసిక్ నుంచి వచ్చిన రావణ్ అనే ఈ గుర్రం ధర ఐదు కోట్లు పలికింది. అయినా అసద్ సయ్యద్ దానిని అమ్మేందుకు నిరాకరించారు. మరింత ధర పలుకుతుందన్న కారణంగానే తాను ఐదు కోట్లకు విక్రయించలేదని సయ్యద్ తెలిపారు. రావణ్ మార్వార్ జాతికి చెందిన అరుదైన గుర్రమట.


Tags:    

Similar News