ముగిసిన పోలింగ్.. ఈవీఎంలను పగులకొట్టి

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరిగింది.

Update: 2023-05-10 13:08 GMT

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరిగింది. ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకూ 66 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.

ఈవీఎంలను మారుస్తున్నారని...
విజయపుర జిల్లా మస బినళ గ్రామంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవీఎంటను గ్రామస్థులు ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన పోలీసులను చితక బాదారు. ఎన్నికల అధికారుల వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈవీఎంలను మారుస్తున్నారన్న ప్రచారమే గ్రామస్థుల ఆగ్రహానికి కారణమయింది. దీనికి సంబంధించి పోలీసులు 23 మందిని అరెస్ట్ చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. అయితే ఆ ఒక్క ఘటన మినహా మిగిలిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Tags:    

Similar News